విశాఖ దక్షిణలో పెన్షన్ దారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ






కడలి న్యూస్, విశాఖపట్నం:– 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 36వ వార్డు పరిధిలో ఎ వి ఎన్ కాలేజీ ఎదురుగా నివసిస్తున్న పలువురు లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.  సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి, పెన్షన్ నగదును అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప  ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన మాట ప్రకారం, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారాని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందజేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేరీ జోన్స్ రాజు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, ఏపీడి పద్మ, సచివాలయ సిబ్బంది, వార్డు కూటమి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు..

కామెంట్‌లు