కడలి న్యూస్, విశాఖపట్నం:– వృత్తిపరమైన నిబద్ధత మరియు నైపుణ్యాభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజుని రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ‘వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు’ తో ఘనంగా సత్కరించింది. సీతమ్మధారలోని ఏ.ఎస్.ఆర్ భవన్ (క్షత్రియ కళ్యాణ మండపం)లో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ (2027-28) రొటేరియన్ పి. శోభన్ ప్రకాష్ పాల్గొన్నారు. విద్యా రంగంలో డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు చేసిన అసాధారణ సేవలను, ఆయన వృత్తిపరమైన ఉత్తమ విలువలను అతిథులు ఈ సందర్భంగా కొనియాడారు.
కార్యక్రమ విశేషాలు:
క్లబ్ ప్రెసిడెంట్ రొటేరియన్. బి. శివాజీ, సెక్రటరీ ఆర్టిఎన్. టి. భార్గవ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
వొకేషనల్ సర్వీస్ డైరెక్టర్, రొటేరియన్ సి.హెచ్.వి. కృష్ణంరాజు నేతృత్వంలో ఈ వేడుక అత్యంత క్రమశిక్షణతో నిర్వహించబడింది.
డాక్టర్ పిల్లా రమణమూర్తి రూపొందించి సమర్పించిన ‘సన్మాన పత్రం’ అందరినీ ఆకట్టుకుంది.
రోటరీ ఆశయమైన సర్వీస్ ఎబౌ సెల్ఫ్ (సేవే పరమావధి) స్పూర్తితో సభ్యులందరూ సమన్వయంతో పనిచేశారని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 110 మంది రోటరీ సభ్యులు, ఆహ్వానితులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
