ఆచార్య కె యస్ .చలం కు తమిళనాడు వి సి కె అంబేద్కర్ అవార్డు.
కడలి న్యూస్:–తమిళనాడు వీసీకే డాక్టర్ అంబేద్కర్ అవార్డును ఆచార్య కె యస్ చలం కు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ , పెరియార్ పేరు మీదుగా యిచ్చే ప్రతిష్టాత్మక అంబేద్కర్ అవార్డును యీ ఏడాది ఆచార్య కే ఎస్ చలంకు అందజేశారు. ఆచార్య చలం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవి పొందిన మొదటి ఆచార్యులు . (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా), అధ్యాపకులుగా ఏయు నుంచి మొట్టమొదటిసారిగా ఉన్నత పదవి పొందారు. ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ అవార్డ్ రావటం విశ్వవిద్యాలయానికి, విశాఖ నగరానికి గౌరవం. దేవనూర్ మహాదేవకు పెరియార్ అవార్డు అందుకున్నారు. దేవనూరు మహాదేవ ప్రముఖ కన్నడ రచయిత. గతంలో విసికె అంబేద్కర్ అవార్డు ను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ప్రధానం చేసారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది ఆచార్య చలంకు అంబేద్కర్ అవార్డు, కట్టప్ప సత్యరాజ్ కు దేవనూర్ మహదేవకు పెరియార్ అవార్డు అందుకున్నారు. కాగా అంబేద్కర్ అవార్డు ప్రముఖమైనది. తమిళనాడులోని చెన్నైలోని అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగునా అతిథులు, అవార్డు గ్రహీతల కటౌట్లు ఏర్పాటు చేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆచార్య కె యస్ చలం ను ప్రశంసించారు.