శాంతి భద్రాలతో పాటు సేవా కార్యక్రమాలలో పోలీసులు భాగస్వామ్యం కావాలి -- పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి




చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు


కడలి న్యూస్, విశాఖపట్నం:–
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు నిబద్ధత తో పని చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన టూటౌన్ లా అండ్ ఆర్డర్, క్రైం, స్టేషన్ లను సందర్శించారు. ఈ సందర్బంగా డీసీపీ -1 మణికంఠ చందోలు, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కే. లక్ష్మణమూర్తి, ఇంచార్జ్ క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, టూటౌన్ సీఐ వీ.వీ.సీ.ఎం.ఎర్రం నాయుడు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైం సీఐ సీహెచ్.రాజుల నాయుడు, సీసీఎస్ సీఐ కోరాడ రామారావు ఇతర అధికారులు, పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో పోలీస్ కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లవర్ గార్డెన్ను, మెడికల్ క్యాంపును సిపి ప్రారంభించారు. దివ్యాంగులను పరామర్శించారు. ప్రేమ సమాజం పిల్లలకు, వృద్ధులకు దుప్పట్లు,పండ్లు, పెన్నులు, పుస్తకాలు, బకెట్లు, మగ్గులు, స్టీల్ కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ  సాటివారికి సహాయం చేసే విషయంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్పందించాలని కోరారు. సేవే దైవంగా భావించాలని చెప్పారు. పోలీసులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పలువురికి పోలీసులు స్ఫూర్తిదాయంగా నిలవాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే విషయంలో చొరవ చూపించాలని చెప్పారు. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో అసాంఘిక శక్తులకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమర్థవంతంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ దొంగతనాలు జరుగకుండా చూసుకోవాలని, విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. డయల్‌ 100 కాల్‌ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశాఖ దక్షిణ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ప్రేమ సమాజం పిల్లలకు సీపీతో కలిసి బకెట్లు, మగ్గులు, స్టీల్ కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వరుసగా సేవా కార్యక్రమాలు చేపడుతూ సాటివారికి సహాయం చేస్తూ వస్తున్న  పోలీస్ కమిషనర్ విశాఖ ప్రజల మనసులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంత లక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు ఎస్ఐలు సతీష్, మన్మధరావు, లక్ష్మి, సంధ్య, రమేష్, క్రైం ఎస్ఐ నాయుడు, బి.రాము, ఎం.శ్రీను, సుందర రాజు సాయిబాబా, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు