కడలి న్యూస్,విశాఖపట్నం :- గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. సచివాలయ పరిధిలో నున్న కుటుంబాల యింటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం కలెక్టరు ఎలమంచిలి, కశింకోట మండలాల్లో పర్యటించారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాల పని తీరును పంశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని తనిఖీ చేశారు. షేక్ ఆలీపాలెం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు, వివిధ పథకాల క్రింద లబ్ది దారుల వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పని ఉద్యోగులను వారి పని తీరును మెరుగు పరచుకొనకపోతే క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. సచివాలయంలో డిస్సెబోర్డులో ప్రదర్శించిన లబ్దిదారుల జాబితా పరిశీలించారు. షేక్ ఆలీపాలెం గ్రామం నుండి ఒక్కరు కూడా కలెక్టరేట్ కు పిటిషన్ తో రాకుండా ప్రజలకు సంతృప్తి కరమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం ద్వారా ప్రభుత్వం ప్రజలకు 543రకాల సేవలను అందిస్తున్నదన్నారు ఈ సేవలు వివరాలన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సేవలపై కరపత్రాలను వివరంగా ముద్రించి గ్రామం లోని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని, జిల్లా వ్యాప్తంగా మిగిలిన డి.ఎల్.డి.ఓ.లు కూడా అమలు చేయాలన్నారు. డి.ఎల్.డి.ఓ సత్యన్నారాయణను ఆదేశించారు. కశింకోట గ్రామంలో, ఎలమంచిలి మండలం మర్రిబందలో లేఅవుట్ , షేక్ ఆలీపాలెం లో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ భవనాలు ఇళ్ల లేఅవుట్, ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఎలమంచిలి మండలంలో షేక్ ఆలి పాలెం గ్రామ సచివాలయ నిర్మాణపు పనులను పరిశీలించారు. భవనాల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లే అవుట్ పనుల పురోగతిపై రెవెన్యూ , మున్సిపల్ శాఖాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ స్టాకును పరిశీలించారు. పులపర్తి గ్రామంలో కలెక్టరు సచివాలయ సిబ్బందిని, ఎఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్ లను విధి నిర్వహణపై ప్రశ్నలు అడిగారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. మహిళా సంరక్షణ సహాయకులను, ఇతర ఉద్యోగులను వారి శాఖకు సంబంధించిన విధులపై ప్రశ్నించారు. ఇళ్ల లేఅవుట్ లను వేగంగా పూర్తి చేయాలి: పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల లే అవుట్ ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. కశింకోట మండలం కశింకోట, ఎలమంచిలి మండలం మర్రిబంద, షేక్ ఆలీపాలెం గ్రామాలలో ఇళ్ల పట్టాల లేఅవుట్ ల పురోగతిని కలెక్టరు తనిఖీ చేశారు. కశింకోటలో ఎ.8-86సెం. భూమిలో 305 మంది లబ్ధిదారులకు, మర్రిబంద గ్రామంలో ఎ.8-86సెం. ఎలమంచిలి మున్సిపాలిటీకి చెందిన 389 మంది లబ్ధిదార్లకు షేక్ ఆలీపాలెంలో ఎ.1-57సెం. భూమిలో 55 మంది లబ్దిదార్లకు పట్టాలు అందించడానికి గాను లేఅవుట్లు అందరికీ అనుకూలంగా వుండేలా, త్వరగా పనులను పూర్తిగా వించాలని అధికారులను ఆదేశించారు. స్థలంలో వున్న తుప్పలను తొలగించి, చదును, శుభ్రం చేయించాల్సిందిగా ఉపాధి హామీ క్రింద పనుల ను చేయించాలని డ్వామా ఎపిడిని ఆదేశించారు. »
షేక్ ఆలీపాలెంలో రైతులు గ్రామంలోని సర్వే నం.313 మకు మంజూరు చేసిన భూములకు పట్టాలు ఇచ్చారని, సదరు భూమిని తమ పేరన వెబ్ ల్యాండ్ లో నమోదు కాలేదని, నమోదు చేయించవలసినదిగా కోరారు. దీనిపై వెంటనే చర్యతీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు. "మర్రిబంద గ్రామంలో గ్రామస్థులు తమకు ఉపాధిహామీ పనులు మంజూరు చేయాల్సిందిగా కోరగా తక్షణం వారికి పనులు కల్పించాలని ఎ.పి.డి.ని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్. ఈ. కుసుమ భాస్కర్, యలమంచిలి మునిసిపల్ కమిషనరు, కృష్ణ వేణి, డివిజనల్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, ఎలమంచిలి తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, డ్వా మా ఎ.పి.డి. తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల సేవల గురించి తెలియజేయాలి
• kadali