కడలి న్యూస్:–పర్యావరణ హితంగా జీవించడానికి పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ఉపకరిస్తుంది అని విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు . ఈ మేరకు ఆయన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ ముద్రించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ను ఆవిష్కరించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా పర్యావరణ దినోత్సవాలు క్యాలెండర్ ముద్రించడం ఆనందదాయకం అన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఈ క్యాలెండర్ వినియోగించి పర్యావరణ దినోత్సవాలు నిర్వహించాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు అవసరమైన పర్యావరణ సమాచారం కూడా అంద జేస్తుందని దీనిని విద్యాసంస్థలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని పర్యావరణ దినోత్సవాలు ఈ క్యాలెండర్ లో ఉండటం వల్ల విద్యా సంస్థలకు బాగా ఉపకరిస్తుంది అని వివరించారు. ఉచితంగా విద్యా సంస్థలకు అందజేస్తున్న ఈ క్యాలెండర్ చాలా విలువైనదిగా గుర్తించి ప్రతి ఒక్కరు పర్యావరణ దినోత్సవాలు తమ సంస్థలో విద్యార్థులు చేత నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి ప్రసాద్, విజయనగరానికి చెందిన టెర్రస్ ఉద్యాన్ గ్రూప్ ప్రతినిధులు లలిత, దివ్య, జ్యోతి ప్రియాంక రమేష్ లు, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ ఎన్జిఓ అనకాపల్లి జిల్లా హెచ్ఆర్డి ట్రైనర్ ఐ కృష్ణకుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం, తదితరులు పాల్గొని మాట్లాడారు.
పర్యావరణ హిత క్యాలెండర్ ఆవిష్కరించిన విఎంసీ కమీషనర్ పల్లి నల్లనయ్య
• kadali