కడలి న్యూస్, విశాఖపట్నం:– నగరంలోని రుషికొండ గీతం విశ్వ విద్యాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి. మహేశ్వర రావు తెలిపారు. శనివారం బీచ్ రోడ్లో ఉన్న తమ కార్యాలయం యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 30 నుంచి జనవరి అయిదవ తేదీ వరకు 17వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది గిరిజన యువతీ యువకులు హాజరవుతా రన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా ఈ ఏడాది కూడా స్మార్ట్ సిటీ విశాఖలో గిరిజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సంస్కృతి, సాంప్రదాయాలను వారికి తెలియజేయడం, గిరిజన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఇక్కడ వారికి చాటి చెప్పడమే ఈ సమ్మేళనం లక్ష్యమన్నారు. ఈ పర్యటనలో ఆదివాసీ యువతీ యువకులు ప్రభుత్వ పారిశ్రామిక ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారని చెప్పారు. గిరిజన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి కూడా వారికి తెలియజేయ నున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో నాలుగు రాష్ట్రాల గిరిజన యువతీ యువకులు ఆయా ప్రాంతాల కళారూపాలను ప్రదర్శిస్తా రన్నారు. దేశ పురోగతిలో గిరిజనుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిం చేందుకు ఈ సమ్మేళనం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో నేరయో భారత్ రిసోర్స్ పర్సన్ ఎన్.నాగేశ్వరరావు ఎన్ఎస్ఎస్ నేషనల్ అవార్డు గ్రహీత ఆర్.లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గీతంలో ఈనెల 30 నుంచి జాతీయ గిరిజన యువ సమ్మేళనం
• kadali