దొంగల వద్ద నుంచి రెండు లక్షల నగదు,13 కాసుల1/4 బంగారం నగలు స్వాధీనంఆటోలో - బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలు..
మహిళా ప్రయాణికులే టార్గెట్
కడలి న్యూస్:– గత నెల కత్తిపూడిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ హ్యాండ్ బ్యాగ్ లో రెండు లక్షల నగదు దొంగించబడిన కేసులో కాకినాడ జిల్లా ఎస్పీ స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో పెద్దాపురం డి.ఎస్.పి పర్యవేక్షణలో ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తొండ శాంతి (35), భూలక్ష్మి (38) అనే ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకొని విచారించగా అన్నవరం, రౌతులపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ల నందు నమోదు కాబడిన కేసులలో వీరి హస్తము ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రికవరీ చేయగా రెండు లక్షల నగదు 106 న్నర గ్రాముల బంగారం వస్తువులను స్వాధీనం చేసుకుని సదరు మహిళలను పోలీసులు రిమాండ్ కి తరలించారు. ప్రస్తుత
ప్రభుత్వం ప్రవేసపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు పదకం ద్వారా ప్రయాణం చేయు మహిళలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని.. అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండాలని ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు పేర్కొన్నారు.