
కడలి న్యూస్, విశాఖపట్నం:– తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 13వ వార్డుకు ఆరిలోవ కు చెందిన యువకుడు బెవర జగదీశ్వర రావు రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియమితులయ్యారు. జగదీశ్వరరావు పదిహేనేళ్లుగా వైసీపీలో వుంటూ వివిధ భాద్యతలు చేపట్టారు. గతంలో కూడా వైసీపీ సోషల్ మీడియా లో పనిచేసిన జగదీశ్వర్ రావు మీడియా ద్వారా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయడంలో ఎంతో శ్రద్ధ తీసుకుని పార్టీ అధిష్టానం మెప్పు పొంది, వైయస్ జగన్ వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు.విద్యార్థి విభాగం నుండి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. వైసిపి పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేసే జగదీశ్వరరావుకు ఈ పదవి వరించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవి నియామకానికి సహకరించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, నగర అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, స్టేట్ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజి రెడ్డిలకు జగదీశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనపై అపారమైన నమ్మకం తో పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని,పార్టీ ఖ్యాతిని సోషల్ మీడియా ద్వారా విశేషంగా పెంపొందించడానికి కృషి చేస్తానని జగదీశ్వరరావు పత్రిక విలేకరులకు తెలిపారు.