కడలి న్యూస్, విశాఖపట్నం :– ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. పుష్పవతి అయిన ఇద్దరు అమ్మాయిలకు టూ టౌన్ సీఐ ఎర్రం నాయుడు చేతుల మీదుగా వెండి పట్టీలు, పట్టు చీరలు, పసుపు కుంకుమ అందజేశారు. వీరిలో 32 వ వార్డు అల్లిపురం ఎల్లపు వారి వీధి ప్రాంతానికి చెందిన లలిత, 33 వ వార్డు, ఎంజీఎం స్కూల్ సమీపంలో గల కె.వరలక్ష్మి ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కే ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇలా ఎంతోమందికి తన పరిధి మేరకు సహాయం చేస్తూ వస్తున్నానని వెల్లడించారు. ఒకపక్క రాజకీయ నాయకుడిగా సేవలు అందిస్తూనే మరోపక్క సంఘ సేవకులుగా ప్రజలకు చేరువై తన పరిధి మేరకు సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. టూ టౌన్ సీఐ ఎర్రం నాయుడు మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు ప్రజల మనిషి అని కొనియాడారు. తన సొంత నిధులతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారని ప్రశంసించారు. ఆయన చేస్తున్న మంచి పనులకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, శ్రీను, ఆది, పాడి రమేష్, మల్ల శీను, మణికుమారి, సిపిఐ బుజ్జి, కుమారి, జానకి, కాండ్రేగుల అప్పారావు, కేదార్నాథ్ బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి -- డాక్టర్ కందుల నాగరాజు