స‌మాచార శాఖ డీడీ డి.ర‌మేశ్ కు ఆత్మీయ సత్కారం, వీడ్కోలు


కడలి న్యూస్, విశాఖ‌ప‌ట్ట‌ణం:–
స‌మాచార పౌర సంబంధాల శాఖ ప‌రిధి విశాఖ‌ప‌ట్ట‌ణంలోని రాష్ట్ర స‌మాచార కేంద్రంలో ఏడీగా సేవ‌లందించి ఇటీవ‌ల డీడీగా ప‌దోన్న‌తి పొందిన‌ దున్న ర‌మేశ్ కు ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు. శుక్ర‌వారం సాయంత్రం స‌మాచార పౌర సంబంధాల శాఖ డీడీ కార్యాల‌యంలో ర‌మేశ్ కు చిరు స‌త్కారం చేశారు. దుశ్శాలువా క‌ప్పి జ్ఞాపిక‌ను బ‌హూక‌రించారు. ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడుతూ ప్ర‌శంసించారు. డీడీ కె. స‌దారావు, డివిజ‌న‌ల్ పీఆర్వో నారాయ‌ణ‌రావు, ఏపీఆర్వో శ్రీనివాస‌రావు, ఏవీఎస్ వెంక‌ట‌రావు, ఏఐఈ రామ‌కృష్ణ‌, పీఆర్వో కిశోర్, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొని ర‌మేశ్ ను స‌త్క‌రించారు. డి. ర‌మేశ్ విజ‌య‌వాడ డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

కామెంట్‌లు