🔸జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో వీర మహిళలకు ఘన సన్మానాలు
కడలి న్యూస్, విజయనగరం:– విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పాల్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వీరమహిళలుకు ఘనంగా సన్మానించారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర తూర్పుకాపు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని హజరయ్యారు ముందుగా వీరమహిళలంతా ఆమెను సత్కరించారు. అనంతరం పాలవలస యశస్వి జనసేన వీరమహిళలను దుస్సాలువాలతో రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్,జనసేన కార్పొరేట్ అభ్యర్థి మాత గాయత్రి, వీరమహిళలు గంట్లాన పుష్పకుమారి,అడబాల మాధవి, లక్ష్మి, పద్మ,సోమాదుల అదిలక్ష్మి లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ.. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు పిలుపుతో జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జనసేన వీరమహిళలను సత్కరించుకోవడం అభినందనీయమని, ఈ సందర్బంగా జనసేన వీరమహిళలు పార్టీ కోసం చేసిన వెలకట్టలేని సేవలను గుర్తుచేసుకోవాలని, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతీ ఒక్కమాహిళా కూటమి విజయానికి కృషిచేసిన ఝాన్సీ లక్ష్మి భాయ్ అని వీరామహిళల సేవలను, జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువనాయకులు లాలిశెట్టి రవితేజ, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, అడబాల ప్రసాద్, సోమాదుల తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.