హాస్టల్స్ లో మెరుగైన వసతులు కలిపించడానికి అవగాహన సదస్సు విశాఖపట్నం,


 గవర్నమెంట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్

బి.సి.వెల్ఫేర్ డిపార్టుమెంటు, విశాఖపట్నం

ఎస్. సత్యనారాయణ I.A.S,  ప్రిన్సిపల్ సెక్రెటరీ , బీసీ వెల్ఫేర్ ఏ.పీ,  విజయవాడ వారు, విశాఖపట్నం, అనకాపల్లి పార్వతీపురం, పాడేరు జిల్లా, శ్రీకాకుళం,  విజయనగరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్, ప్రిన్సిపల్స్,  మహాత్మ జ్యోతిరావు ఫూలే బి.సి.రెసిడెన్ స్కూల్స్ వారికి, హాస్టల్స్ లో మెరుగైన వసతులు  కలిపించడానికి అవగాహన సదస్సు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్, విశాఖపట్నం నందు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ అంశాలు వారిగా అధికారుల యొక్క ప్రతిభ, సేవలను అనుసరించి వారికి మార్కులు కేటాయించడం జరుగుతుంది అని తెలియజేసినారు. ఉన్తమయిన, నాన్యమయిన సదుపాయాలు విద్యార్ధులకు కల్పించాలని తెలియజేసినారు. తదుపరి జిల్లా వారిగా సమీక్ష చేసి తగు సూచనలు ఎస్. సత్యనారాయణ  I.A.S,  ప్రిన్సిపల్ సెక్రెటరీ, బీసీ వెల్ఫేర్ ఏ.పీ,  విజయవాడ వారు అధికారులందరికీ ఇవ్వడము జరిగింది. కె రామారావు గారు, డి.డి., సోషల్ వెల్ఫేర్ మరియు డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్(ఎఫ్.ఎ.సి.) , విశాఖపట్నం వారు సభా కార్యక్రమమును ప్రారంభించి అధికారులందరిని ఆహ్వానించడము జరిగింది. తదుపరి  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కి తగు సూచనలు ఇవ్వడము జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ .సన్యాసి నాయుడు, సీనియర్ సివిల్ జడ్జ్  జిల్లా న్యాయ సేవ సంస్ధ కార్యదర్శి విశాఖపట్నం  వారు మాట్లాడుతూ, తాను కూడా బి.సి. బాయ్స్ హాస్టల్, జొన్నలవలస, విజయనగరం జిల్లాలో చదివి ఈ రోజు జిల్లా జడ్జ్  హోదాలో వున్నాను అని తెలియ జేసినారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరు అంకిత భావముతో పనిచేస్తే చాలా మంది విద్యార్ధులు ఉన్నత మయిన సిఖరాలు అందుకుంటారని తెలియజేస్తూ అందుకు ఉదాహరణ నేనే అని తెలియజేసినారు. 

  ప్రొఫెసర్ ఎం.వి.రాజు , సైకాలజీ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ, ఆంధ్ర యూనివర్సిటీ వారు అధికారులకి లీడర్ షిప్ క్వాలిటీస్ వుండాలని, ఉన్నతమయిన విలువలు పాటించి హాస్టల్ విద్యార్ధులకు  ఆదర్సముగా వుండాలని వారి జీవితాలను మార్చే శక్తి అధికారులకు వుందని తెలియజేసినారు. విద్య ఒక్కటే కాదు ప్రవర్తనలో కూడా మార్పు రావాలని, ముందు మనము మారితే విద్యార్ధుల ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని తెలియ జేసినారు. ఈ కార్యక్రమంలో డి చంద్రశేఖర్,  డైరెక్టర్ బీసీ వెల్ఫేర్,  విజయవాడ,  పి మాధవి లత, సెక్రటరీ మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ విజయవాడ, ఎం చినబాబు, జాయింట్ డైరెక్టర్ ఏపీ విజయవాడ, కె.రామరావు గారు, డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్ ,విశాఖపట్నం,  కె శ్రీదేవి, డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్ అనకాపల్లి  కె అనురాధ, డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీకాకుళం,  జె జ్యోతిశ్రీ , డిస్ట్రిక్ట్  బిసి వెల్ఫేర్ ఆఫీసర్ , విజయనగరం,  పార్వతీపురం, ఎ.ఎస్.ఆర్, పాడేరు జిల్లాల  అధికారులు, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా పరిషత్ మీటింగ్ హాల్, విశాఖపట్నం నందు పాల్గొనడం జరిగింది

కామెంట్‌లు