క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు... పట్టుకున్న పోలీసులు
కడలి న్యూస్, విశాఖపట్నం:– క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కి చెందిన ఖతున్, ఒడిశాకు చెందిన నాయక్తోపాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. 18 బ్యాట్లలో రూ.90 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.