ప్రపంచ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందా :జీవీఎంసీ కమిషనర్ కేతన్‌ గార్గ్





కడలి న్యూస్, విశాఖపట్నం:–
ఆగస్టు19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన తనకు గొప్ప అనుభూతినిచ్చిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రెండవ రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఆయన స్వయంగా తన మొబైల్ ద్వారా క్లిక్ మనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్  ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలుతో పాటు మరోవైపు పలు సమస్యలను ప్రతిబింబిస్తూ, ఇంకోవైపు అనేక విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు  మనకు గుర్తుకు రావడం ఖాయం అన్నారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఛాయాచిత్రాలు అక్కడ జరిగే సంఘటన కళ్ళకు కట్టేలా ప్రతిబింబిస్తాయని తెలియజేశారు. ఆయా ఫోటోల ద్వారా నగరంలో అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందన్నారు. వచ్చే సంవత్సరం తప్పకుండా స్క్రీన్ ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ప్రతి ఒక్కరూ తిలకించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దానికి జీవీఎంసీ తరఫున సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయన్నారు. ప్రపంచ స్థాయిలో సైతం ఫోటోగ్రాఫర్స్ కు గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు రోజులు ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. జీవీఎంసీ జోన్ త్రి జోనల్ కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ అద్భుతమైన రీతిలో ఫోటో ఎగ్జిబిషన్ ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలు చూస్తుంటే ఒక్కసారిగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న అనేక విషయాలు తెలుస్తున్నాయన్నారు.  కార్యక్రమంలో వైజాగ్  కమిషనర్ చేతుల మీదగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ ఫోటో జర్నలిస్టులుగా గెలుపొందిన ఫోటో జర్నలిస్టులు కమిషనర్ చేతుల మీదుగా సత్కరించి సన్మానించారు.  కార్యక్రమానికి వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ప్రెసిడెంట్ వై రామకృష్ణ అధ్యక్షత వహించగా  సెక్రటరీ ఎండి నవాజ్, కోశాధికారి ఏ శరత్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులంతా కలిసి జీవీఎంసీ కమిషనర్ను ఘనంగా సత్కరించి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ పాలునరావు, సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,  జీవీఎంసీ పిఆర్ఓ నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ,  విద్యార్థులు, అధ్యాపకులు నగర ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు