కడలి న్యూస్, విశాఖపట్నం:– రాష్ట్ర స్థాయి నాయకులు సమావేశం కోసం జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీన విశాఖలోని మున్సిపల్ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్యులు పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి సంబంధించి పౌర గ్రంధాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. గత వైసీపీ పాలనలో అవినీతిని ఎండకట్టిన పార్టీ జనసేన అన్నారు. కూటమి పార్టీ ఏర్పాటుకు కృషి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ మంచి పాలన అందిస్తున్న నాయకుడన్నారు.
ఇచ్చిన హామీలు ను అమలు చెయ్యటం లో ప్రభుత్వం ముందు ఉన్నది.
ప్రభుత్వం పథకాలు ను ప్రజలు కు చేరే వేసే లా చూస్తున్నాం.
ఏడాది పాలన పూర్తి కావటం తో జనసేన కార్యకర్తలు నాయకులు తో సమావేశం ఏర్పాటు కృషి చేస్తున్నాం.
రాష్ట్రం నలుమూలల నుండి భారీ గా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ నుండి కింద స్థాయి కార్యకర్త పాల్గొనే లా ఏర్పాట్లు చేస్తున్నాం.
14000 మంది వాలంటీర్లు తో ఏర్పాట్లు పరివేక్షణ చేస్తున్నాం.
ఈ వేదిక నుంచి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి సందేశం ఇస్తారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కూటమి స్ఫూర్తిని, కూటమి ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై కార్యకర్తలకి రోడ్ మ్యాప్ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలోఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హరి ప్రసాద్ గారు, జనసేన పార్టీ విశాఖపట్నం అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , రూరల్ అధ్యక్షులు,పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, ఇతర పార్టీ పెద్దలు పాల్గొన్నారు.