కడలి న్యూస్:- ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా అనర్హత వేటు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంలో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక ఈ రూల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చట్టంలో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. అయితే మిగిలిన 20 సెక్షన్లలో కూడా జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల వాటిపై కూడా వెసులుబాటు కల్పించాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీనితో కేంద్రం సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వారు తప్పనిసరిగా సవరించిన చట్టాన్ని అమలు చేయాలని.. ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
ఏపీ వాహనదారులకు హెచ్చరిక !
• kadali